ఉదయం లెచినప్పట్టినుంచి మల్లీ తిరిగి ఇంటికి వెల్లెంత వరకు ఎక్కడ చూసినా పొగ.. పొగ. కిరొసిన్ పొసి నడిపించె ఆటొలు, కనీసం నంబరు కూడ కనిపించని స్కూటర్లు, లారిలు, గర్వంగా పొగ విడిచె షెర్ ఔటొలు, అభ్బా, ఒక్కొసారి జీవితం మీద విరక్తి పుట్టి, ఉద్యగం లెకుండా ఇంట్లోనె ఉండె పనెదైనా ఉంటే బాగుంటుందెమో అనిపిస్తుంది.
ఇక ఈ లిస్టులో చెరిన కొత్త వాహన సముదాయం GMR ఏరొ ఎక్ష్ప్రెస్స్ బస్సులు.విమనాలతో సమానంగా పొగవదలడం వల్ల కాబొలు వీటికి ఆ పెరు పెట్టారు. ఈ రొజు నెను గమనించిన వాహనము నంబరు AP 29T 3645
1074 కు ఫొను చెసి చెప్పగా ఇచ్చిన రెఫరెన్సు నంబరు 11040708. వారం లోగా పరిశీలిస్తామని చెప్పారు. చూడాలి ఎం చెస్తారో.
మీకు ఒకవేల్ల గుప్పు గుప్పు మంటూ ఎమైనా వాహనం కనిపిస్తే ఓపిక చెసుకొని కొంచం 1074 కి ఫొను చెసి కంప్లైంట్ ఇస్తారు కదూ.